ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక రాయలసీమ బిల్లు ప్రవేశపెట్టాలి

ABN, First Publish Date - 2022-01-24T04:41:41+05:30

ఈ నెల 31న ఆరంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టాలని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచెం వెంకటసుబ్బారెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచెం 

కర్నూలు(న్యూసిటీ), జనవరి 23: ఈ నెల 31న ఆరంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టాలని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచెం వెంకటసుబ్బారెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమకు చెందిన అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాయలసీమ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలన్నారు. 1951నాటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వేలూరు, క్రిష్ణగిరి, బళ్లారి, రాయచూర్‌, చిత్రదుర్గ, కోలార్‌ జిల్లాలను కలిపి ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో కేంద్ర పాలిత ప్రాంతంగా పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాకినాడ బీజేపీ ప్లీనరీలో ఆ పార్టీ చిన్నరాష్ట్రాలకు మద్దతు ప్రకటించిన విషయం గుర్తు చేశారు. కర్నూలులో బీజేపీ రాయలసీమ డిక్లరేషన విడుదల చేసిందని, దాని ప్రకారం కూడా చిన్న రాష్ర్టాలకు మద్దతు ఇవ్వాల్సి ఉంద ని అన్నారు. బీజేపీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరి స్తోందన్నారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి, అన్ని చెరువులు నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాయలసీమ ప్రాంతానికి పోలవరం నుంచి రావాల్సిన 30 టీఎంసీల నీటి వాటాను కేటాయించాలని డిమాండ్‌ చేశారు

Updated Date - 2022-01-24T04:41:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising