ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN, First Publish Date - 2022-01-19T05:16:30+05:30

ఎన్టీ రామారావు 26వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘన నివాళి అర్పించారు.

టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కర్నూలు(అగ్రికల్చర్‌)/కల్లూరు: ఎన్టీ రామారావు 26వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘన నివాళి అర్పించారు. చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేశారు. టీడీపీ 14 నియోజకవర్గాల ఇనచార్జిలు, ఇతర నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. 

-  నగరంలో కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇనచార్జి టీజీ భరత తదితరులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. 

-  నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు మాధవనగర్‌లోని తన నివాసంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలుగుగంగ ప్రాజెక్టును నిర్మించి భూములను సస్యశ్యామలం చేయడమే కాకుండా.. ఇతర జిల్లాలకు తాగునీరు అందించిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. 


Updated Date - 2022-01-19T05:16:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising