ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల పట్ల తీవ్ర వివక్ష

ABN, First Publish Date - 2022-01-26T04:30:33+05:30

ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న బీసీ జనార్దనరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే బీసీ 

బనగానపల్లె, జనవరి 25: ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి తెలిపారు. వారిపట్ల ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని మండిపడ్డారు. బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో  మంగళవారం పెన్షనర్ల సంఘం నాయకులు ఫక్కీర్‌ రెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులతో కలసి బీసీ విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లో పాత పెన్షన విధానాన్ని అమలు చేస్తామని సీఎం జగన ఉద్యోగులకు హామీ ఇచ్చారని, మూడేళ్లయినా మాట నిలబెట్టుకోలేదని అన్నారు. ఉద్యోగులకు మంచి పీఆర్‌సీ ఇస్తామని, డీఏలు ఇస్తామని చెప్పి నేడు భయపెడుతున్నారని అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ మాదిరి రివర్స్‌ పీఆర్‌సీ ఇచ్చి ఉద్యోగులను, పెనషనర్లను నిలువునా ముంచారని అన్నారు. ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, రోశయ్య, వైఎ్‌స రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు తమ హయాంలో ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ పెంచి న్యాయం చేశారని అన్నారు. లోటు బడ్డెట్‌ అంటూ జగన పచ్చి అబద్దాలు ఆడుతున్నారని అన్నారు. రాజకీయ నిరుద్యోగులైన  160 మందిని సలహాదారులను, చైర్మనలను నియమించి వారికి రూ.కోట్లు జీతం ఇస్తున్నారని బీసీ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వైఖరినికి నిరసనగా లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు ఎక్కారని అన్నారు. ఉద్యోగులపై సోషల్‌ మీడియా ద్వారా వైసీపీ విషప్రచారం చేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీసీ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు రామసుబ్బయ్య,  వెంకటరెడ్డి, మహబూబ్‌ బాషా, నాగరాజు, శ్రీనివాసరావు, సురే్‌షరెడ్డి, హనీఫ్‌, నరసింహులు, నాగపుల్లయ్య, డేవిడ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-01-26T04:30:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising