ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజ్ఞానమా...వినోదమా?

ABN, First Publish Date - 2022-09-25T05:33:03+05:30

నగర పాలక సంస్థ కార్పొరేటర్ల విజ్ఞాన యాత్ర వివాదస్పదంగా మారింది. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆగ్రా వద్ద ఫోటో దిగుతున్న నగర మేయర్‌, కార్పొరేటర్లు,కో ఆప్షనసభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 24: నగర పాలక సంస్థ కార్పొరేటర్ల విజ్ఞాన యాత్ర వివాదస్పదంగా మారింది. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఉండగా కార్పొరేటర్లు విజ్ఞాన యాత్ర పేరుతో విహార యాత్రకు వెళ్లడంపై మేధావులు మండిపడుతున్నారు. కార్పొరేషనలో ఉన్న పరిస్థితులపై అవగాహన లేకుండా పది రోజుల పాటు జరిగే విజ్ఞాన యాత్రలో భాగంగా తాజమహల్‌, మధుర, ఆగ్రా కోట, అక్షరధామ్‌, ఇండియాగేట్‌, ఎర్రకోట, కుతుబ్‌మినార్‌, మనాలిలో సోలాంగ్‌ వ్యాలీ, అటల్‌ టన్నెల్‌, హడింబా టెంపుల్‌, వశిష్టకుండ, రోహిహ్యాండ్‌పాస్‌, చండీగడ్‌లో గోల్డెనటెంపుల్‌, వాఘా బార్డర్‌, జులియనవాలా బాగ్‌ వెళ్లటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పది రోజుల పాటు జరిగే యాత్రలో ఫ్లైట్‌, హోటల్‌ చార్జీలు, భోజనాలు, టిఫిన ఖర్చులకు ఒక్కో కార్పొరేటర్‌కు రూ.65 వేలు ఖర్చు అవుతుంది. వీరితో పాటు కార్పొరేషన అధికారులు ఇద్దరు ఉన్నారు. వారికి కూడా కార్పొరేషన ఖర్చు భరించాల్సి ఉంటుంది. దీంతో కార్పొరేషన ఖజానాపై భారం పెరుగుతుంది. 14,15 ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషనకు ఇంకా రిలీజ్‌ చేయలేదు. ఆ నిధులను మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన అనేక  బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా తెప్పించలేని వైసీపీ పాలకులు యాత్రల పేరుతో లక్షలాది రూపాయల ప్రజాదనం దుర్వినియోగం చేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. 


ఫ తాజ్‌మహల్‌ వద్ద ఫొటోకు ఫోజు...

 సమస్యలను పరిశీలించి పరిష్కారానికి సహకారం అందించాల్సిన కార్పొరేటర్లు విహార యాత్రకు వెళ్లడం ఎంతవరకు సమంసజమని కొందరు ప్రశ్నిస్తున్నారు. విజ్ఞాన యాత్రలో భాగంగా శనివారం మేయర్‌తో పాటు కార్పొరేటర్లు, కో ఆప్షన సభ్యులు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ వద్ద ఫొటోకు ఫోజిచ్చారు. తాజ్‌ మహల్‌ చూసి..ఏమి నేర్చుకున్నారు...మరో తాజ్‌ మహల్‌ను కర్నూలులో కడతారా?అంటూ నగర ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. 



Updated Date - 2022-09-25T05:33:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising