ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ కార్మికుల నిరసన

ABN, First Publish Date - 2022-08-04T05:52:44+05:30

కర్నూలు-1, 2 డిపో ఎదుట రీజినల్‌ కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం నాయ కులు, కార్మికులు కలిసి నిరసన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(రూరల్‌) ఆగస్టు 3: కర్నూలు-1, 2 డిపో ఎదుట రీజినల్‌ కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం నాయ కులు, కార్మికులు కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమానికి కర్నూలు 1, 2 డిపో ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శులు మహేశ్వరరావు, ఆర్‌వీఎం.రావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా రీజినల్‌ కార్యదర్శి ఏవీ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ సిబ్బంది ఏమైనా తప్పులు చేస్తే శిక్షలు వేసేందుకు 2019లో ఉన్న ఆర్టీసీ ఎండీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి ఏ తప్పుకు ఎలాంటి శిక్షలు వేయాల్లో పారదర్శకంగా ఉండేవిధంగా సర్క్యులర్‌ అమలు చేసేవారని గుర్తు చేశారు. అయితే ఆదోని డిపో మేనేజర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తూ సర్క్యులర్‌కు విరుద్ధంగా నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఆదోని డిపోలో ఇద్దరు సిబ్బంది మధ్య జరిగిన వివాదంలో ఆర్‌బీ. సుధాకర్‌ అనే మోకానిక్‌ను అన్యాయంగా సస్పెం డ్‌ చేశారన్నారు. ఇది కేవలం డిపో మేనేజర్‌ కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. తక్షణమే సుధాకర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో అధ్యక్షుడు జీవీ రెడ్డి, గ్యారేజి కార్యదర్శి వీరేష్‌, కార్మికులు సుజయ్‌, గౌడ్‌, క్రిష్ణ, సుధాకర్‌, దాస్‌, ప్రసాద్‌, రాముడు, పుల్లయ్య, భాస్కర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-04T05:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising