ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షంతో పొంగిన వాగులు

ABN, First Publish Date - 2022-10-01T05:57:51+05:30

మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉధృతంగా ప్రవహిస్తున్న తుమ్మలవాగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉధృతంగా ప్రవహించిన తుమ్మలవాగు
నిలిచిన రాకపోకలు

 కోడుమూరు (రూరల్‌), సెప్టెంబరు 30: మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి వేకువ జాము వరకు ఎడతెరపిలేని వర్షం కురిసింది. వర్ష ప్రభావంతో వాగులు, వంకలు పొంగాయి. లోతట్టు వీధులు, పొలాలు నీట మునిగాయి. కోడు మూరు- ఎమ్మిగనూరు రహదారిపై వర్కూరు వద్ద తుమ్మలవాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం వెళ్లు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. మంత్రాలయం వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు వాగు దాటే క్రమంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వర్షపు నీరు భారీగా చేరడంతో గోరంట్ల వద్ద హంద్రీనది నిండుగా ప్రవహించింది. గోరంట్ల రైతులు, అవతలి ఒడ్డు గ్రామాలైన ఎర్రగుడి, కొత్తపల్లి, మన్నెగుంట తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం 39.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.


Updated Date - 2022-10-01T05:57:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising