ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సామూహిక వివాహాలు

ABN, First Publish Date - 2022-04-25T04:37:16+05:30

మండల పరిధిలోని మదిరె గ్రామంలో ఆదివారం సామూహిక వివాహ మహోత్సవాలు ఘనంగా జరిగాయి.

వధూవరులతో సందడిగా మారిన ఉటగనూరు తాత మఠం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వధూవరులను ఆశీర్వదించిన మఠాధిపతులు 

ఒక్కటైన 29 జంటలు


కౌతాళం,ఏప్రిల్‌ 24: మండల పరిధిలోని మదిరె గ్రామంలో ఆదివారం సామూహిక వివాహ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని ఉటగనూరు తాత మఠం ఆవరణలో 29 జంటలకు వివా హాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో హాల్వి మఠం పీఠాధిపతి అభినవ మహాంతస్వాములు, హచ్చోళ్ళి, నదిచాగి, రౌడకుంది మఠాధిపతులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వివాహ మహోత్సవాలలో భాగంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, వాల్మీకి ఫెడరేషన్‌ మాజీ డైరెక్టర్‌ ఉలిగయ్య, చన్నబసప్ప, సురేష్‌నాయుడు, సుధీర్‌రెడ్డి, సతీష్‌నాయుడు, గోవిందు జనసేన ఇన్‌చార్జి లక్ష్మణ్‌, సీపీఎం నాయ కులు మల్లయ్య పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు తమవంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మఠం పెద్దలు పంపారెడ్డి తాత, మల్లయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు.


సామూహిక వివాహాల్లో పాల్గొన్న మంత్రి 


మదిరె గ్రామంలో ఆదివారం సామూహిక వివాహ ఉత్సవాల్లో కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ముందుగా కౌతాళానికి విచ్చేసిన మంత్రి జయరాం గ్రామంలోని వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సామూహిక వివాహంలో వధూవరులను ఆశీర్వదించారు. మారుమూల గ్రామాల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలకు తనవంతు సహకారం అందజేస్తానని తెలిపారు.

Updated Date - 2022-04-25T04:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising