ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో రోజు కొనసాగిన రిలే దీక్షలు

ABN, First Publish Date - 2022-09-30T05:55:15+05:30

విజయవాడలోని హెల్త్‌ యూనివ ర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించటాన్ని నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే దీక్షలు కొనసాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలి: మాజీ ఎమ్మెల్యే

ఎమ్మిగనూరు, సెప్టెంబరు 29: విజయవాడలోని హెల్త్‌ యూనివ ర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించటాన్ని నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే దీక్షలు కొనసాగాయి. గురువారం దీక్షలను మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానీ యుడు ఎన్టీఆర్‌ అని, అటువంటి మహానేత పేరు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి విచ్చన నాటి నుంచి కూల్చ టం, పేర్లు మార్చటం తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. దమ్ముంటే కొత్త నిర్మాణాలు చేసి వాటికి పేర్లు పెట్టుకోవాలన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ఛీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ పేరును తొలగిస్తే సహించేది లేదని, పేరు కొనసాగించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. రెండో రోజు దీక్షల్లో మాజీ ఎంపీపీ వాల్మీకి శంకరయ్య, నారాయణ రెడ్డి, ధర్మపురం గోపాల్‌, సురేష్‌ చౌదరి, జబ్బార్‌, సోమన్న, రామకృష్ణారెడ్డి, మిన్నప్ప, నాగరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు వైపీఎం కొండయ్య చౌదరి, ముగతి ఈరన్న గౌడ్‌, కౌన్సిలర్లు రామదాసు గౌడ్‌, వీజీఏ దయాసాగర్‌, రంగస్వామి గౌడ్‌, జయన్న, నాగేష్‌ ఆచారి, బచ్చాల రంగన్న, పెద్దరంగన్న, కటారి రాజేంద్ర, ఖాజా, అబ్రహం, మాబు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-30T05:55:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising