ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రమణీయంగా మాళమల్లేశ్వరుని రథోత్సవం

ABN, First Publish Date - 2022-10-08T04:32:33+05:30

దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి దసరా బన్ని ఉత్సవాలులో భాగంగా శుక్రవారం రాత్రి రథోత్సవం భారీ జన సందోహం మధ్య వైభవంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హొళగుంద అక్టోబరు 7:  దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి దసరా బన్ని ఉత్సవాలులో భాగంగా శుక్రవారం రాత్రి  రథోత్సవం భారీ జన సందోహం మధ్య వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారికి   రుద్రాభిషేకం, బండార్చన, రథసంస్కారం, రథాంగహోమం చేశారు, సాయంత్రం బిలేహల్‌ గ్రామస్థులు మేటి కుంభంతో రావడంతో రథోత్సవం వేడుకలు ప్రారంభమయ్యాయి.  మాళమల్లేశ్వర స్వామి వారి విగ్రహాలను రథంపై చేర్చి, రథాన్ని ఎదురు బసవన్న గుడి వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. రథోత్సవంలో గొరవయ్యల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్సైలు అబ్దుల్‌ జహీర్‌, రామాంజులు, విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవరగట్టు ఆలయ కమిటీ సభ్యులు వీరనాగప్ప, రాము నాయక్‌, రామయ్య, సోమప్ప, లక్ష్మణ్ణ, మంజు నాయక్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-10-08T04:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising