ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామలింగేశ్వరుడి రథోత్సవం

ABN, First Publish Date - 2022-01-17T05:42:06+05:30

రాంపురం రామలింగేశ్వర స్వామి మహారథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంపురంలో అశేష భక్త జనం

మంత్రాలయం, జనవరి 16: రాంపురం రామలింగేశ్వర స్వామి మహారథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తుంగభద్ర నది ఒడ్డున వెలసిన రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో రాంపురం వీధులన్నీ  ఆదివారం భక్తులతో కిక్కిరిశాయి. ఆలయ ధర్మకర్తలు పాటిల్‌ లలితమ్మ, సీతారామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు వెంకట్రామిరెడ్డి, సాయిప్రసాద్‌ రెడ్డి, బాలనాగిరెడ్డి, మంచాల సొసైటీ అధ్యక్షుడు ప్రదీప్‌ రెడ్డి, ఆంధ్ర, కర్ణాటక మఠాల పీఠాధుపతులు వేడుకలో పాల్గొన్నారు. రాంపురం రెడ్డి సోదరుల ఇంటి నుంచి ఉత్సవమూర్తిని ఆలయం వరకు చేర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మహారథంపై అధిష్టింపజేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. నందికోల నృత్యాలు, కోలాటాలు, వేషధారణలు, మంగళవాయిద్యాలు, బీరప్ప డోళ్లు, తప్పెట్లతో రథం ముందుకు సాగింది. ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌, మంత్రాలయం సీఐ భాస్కర్‌, మాధవరం, మంత్రాలయం ఎస్‌ఐలు హుసేన్‌పీరా, వేణగోపాల్‌ రాజు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2022-01-17T05:42:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising