ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటికాలిపై నిరసన

ABN, First Publish Date - 2022-01-22T05:36:23+05:30

ఉద్యోగ, ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఎమ్మిగనూరులో శుక్రవారం ఏఐటీయూసీ, ఎస్టీయూ నాయకులు ఒంటి కాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

ఒంటికాలిపై నిరసన తెలుపుతున్న ఏఐటీయూసీ, ఎస్టీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
ఎమ్మిగనూరులో ఏఐటీయూసీ, ఎస్టీయూ డిమాండ్‌


ఎమ్మిగనూరు, జనవరి 21: ఉద్యోగ, ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఎమ్మిగనూరులో శుక్రవారం ఏఐటీయూసీ, ఎస్టీయూ నాయకులు ఒంటి కాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సోమప్ప సర్కిల్‌లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప, సీపీఐ నాయకులు పంపన్నగౌడ్‌, ఎస్టీయూ నాయకులు ప్రసన్న రాజు, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు రంగన్న ఆధ్వర్యంలో కార్మికులు, ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తిరోగమన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఆర్‌ఏ స్లాబులను కొనసాగించాలని కోరారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు బాలరాజు, సత్యన్న, వీరేష్‌, భాస్కర్‌నాయుడు, జబ్బర్‌, నరసింహులు, సోమేశ్వరరెడ్డి, మల్లికార్జున గౌడ్‌, నారాయణ, ఎస్టీయూ నాయకులు వెంకటేశ్‌, సత్తెన్న, ఉరుకుందు, తిమ్మరాజు, తిమ్మన్న, సురేష్‌ పాల్గొన్నారు.

రివర్స్‌ పేని తేవడం నిరంకుశత్వం

ఆదోని(అగ్రికల్చర్‌), జనవరి 21: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ ఉద్యోగులకు ఆమోదయోగ్యం కాదని, రివర్స్‌ పేను మంత్రి మండలి తీసుకరావడం నిరంకుశత్వానికి నిదర్శనమని మున్సిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి సురేష్‌కుమార్‌, పట్టణ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం నెహ్రూ మెమోరియల్‌ పాఠశాలలో పీఆర్‌సీ మంత్రివర్గ ఆమోదంపై నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ఆశుతోష్‌మిశ్రా కమిటీని బుట్టదాఖలు చేసి విభాగాల అధిపతులచే తెప్పించుకున్న నివేదికను బలవంతంగా రుద్దడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే చీకటి జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జంగం బసవరాజు, కోటన్న, వెంకటేశ్వర్లు, రాజేశ్వర్‌రెడ్డి, ధనుంజయ్‌, నందీశ్వర్‌, దస్తగిరి, బడుగు బసవరాజు, ప్రతాప్‌రెడ్డి, కల్యాణ్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising