ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన

ABN, First Publish Date - 2022-06-26T04:47:49+05:30

ఉమ్మడి జిల్లాలోని గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన డిక్లేర్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవో నెం.5 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

కర్నూలు(న్యూసిటీ) జూన 25: ఉమ్మడి జిల్లాలోని గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన డిక్లేర్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌జైన జీవో నెంబరు 5 జారీ చేశారు. ప్రస్తుతం నెలకు రూ.15 వేలు జీతం తీసుకుంటున్న ఉద్యోగికి ప్రొబేషన అనంతరం రూ.30 వేలకు పైగా జీతం అందనుంది. జూలై నుంచి పీఆర్‌సీ ప్రకారం కొత్త జీతం అందనుంది. 2019 అక్టోబరులో విధుల్లో చేరి రెండేళ్ల సర్వీసుతోపాటు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి జాబితాలను ప్రభుత్వానికి నివేదించారు. కర్నూలు జిల్లాకు 5,504 పోస్టులు మంజూరయ్యాయి. అందులో 4,800 మంది వివిధ కేడర్లలో పని చేస్తున్నారు. ఇందులో 4,060 మందిని ప్రొబేషనకు అర్హులుగా గుర్తించారు. మిగతా 737 మందిలో కొందరు మధ్యలోనే వెళ్లిపోవడం, మరి  కొందరు ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం వంటి కారణాలతో వారిని పక్కన బెట్టారు. అదేవిధంగా నంద్యాల జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ పోస్టులు 4,374  మంజూరయ్యాయి. 3,830 మంది ఉద్యోగులు వివిధ కేడర్లలో పని చేస్తున్నారు. ఇందులో 3,406 మందిని ప్రొబేషనకు అర్హులుగా గుర్తించారు. 


Updated Date - 2022-06-26T04:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising