ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-01-21T04:33:59+05:30

ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ముట్టడికి కర్నూలుకు వెళ్తున్న ఉపాధ్యాయులను గురువారం ఎమ్మిగనూరులో పోలీసులు అడ్డుకున్నారు.

ఎమ్మిగనూరులో రోడ్డుపై బైఠాయించిన ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డుపై బైఠాయించిన ఎస్టీయూ నాయకులు

ఎమ్మిగనూరు/ఆదోని(అగ్రికల్చర్‌), జనవరి20: ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ముట్టడికి కర్నూలుకు వెళ్తున్న ఉపాధ్యాయులను గురువారం ఎమ్మిగనూరులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్యాప్టో పిలుపు మేరకు కలెక్టరేట్‌ ముట్టడికి ఆదోని నుంచి ట్రాక్సీలో వెళ్తున్న ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులను ఎమ్మిగనూరులో పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌ జీ నాగరాజు మాట్లాడుతూ పీఆర్సీపై ప్రభుత్వం దుర్మార్గమైన జీవోలు ఇచ్చిందన్నారు. ఈ జీవోలను రద్దు చేయాని కోరుతూ ఫ్యాప్టో పిలుపు మేరకు ఎస్టీయూ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవటం దారుణమని అన్నారు. కార్యక్రమంలో నాయకులు వీరచంద్ర యాదవ్‌, రమేష్‌నాయుడు, రవి, గురు, పద్మ, శకుంతలతోపాటు ఉపాధ్యయులు పాల్గ్గొన్నారు. అనంతరం పోలీసులు ఉపాధ్యాయులను ఆదోనికి  తిప్పి పంపారు.

Updated Date - 2022-01-21T04:33:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising