ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలంలో గుంత

ABN, First Publish Date - 2022-01-27T05:31:42+05:30

మండలంలోని ఆలమూరు గ్రామంలోని రైతు శ్రీనివాసరెడ్డి పొలంలో బుధవారం ఆరడుగుల మేర గుంత ఏర్పడింది.

గుంతను పరిశీలిస్తున్న తహశీల్దారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఆందోళనలో రైతులు


పాణ్యం, జనవరి 26: మండలంలోని ఆలమూరు గ్రామంలోని రైతు శ్రీనివాసరెడ్డి పొలంలో బుధవారం ఆరడుగుల మేర గుంత ఏర్పడింది. దీంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు.  ఇటీవల వరిమడిలో నాట్లు వేసినపుడు ఎటువంటి గుంత లేదని రైతు తెలిపాడు. గుంత ఏర్పడి వరిమడికి వదలిన నీరు గుంతలోకి వెళ్లింది. ఈవిషయం తెలుసుకున్న తహసీల్దారు శివప్రసాదరెడ్డి, వీఆర్వో మనోహర్‌, వ్యవసాయ సిబ్బంది అక్కడికి వెళ్లి గుంతను పరిశీలించారు. గుంతను చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పొలంలోకి ప్రజలు, పశువులు వెళ్లకుండా వరి మడి  చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గుంత ఏర్పడటానికి గల కారణాలను తెలుసుకుంటామని తహసీల్దార్‌ తెలిపారు. 

Updated Date - 2022-01-27T05:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising