ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిథిలావస్థలో పాణికేశ్వరస్వామి ఆలయం

ABN, First Publish Date - 2022-01-22T04:42:12+05:30

ఏడు శతాబ్దాల చరిత్ర ఉన్న స్థానిక పాణికేశ్వర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది.

పగుళ్లిచ్చిన పాణికేశ్వర ఆలయ గాలిగోపురం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. గాలిగోపురానికి బీటలు 
  2. పట్టించుకోని అధికారులు


పాణ్యం, జనవరి 21: ఏడు శతాబ్దాల చరిత్ర ఉన్న స్థానిక పాణికేశ్వర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. 13వ శతాబ్దంలో చోళరాజుల హయాంలో జైన సంప్రదాయ ప్రకారం అప్పటి  విష్ణువర్ధన చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణంతోనే గ్రామానికి పాణ్యం అనే పేరు వచ్చింది. ఈ ఆలయానికి 50 ఎకరాల మాన్యం ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు.


దుండగుల దాడులతో శిథిలం

ఆలయంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయన్న ఆశతో కొందరు దండగులు పలుమార్లు ఆలయ గర్భగుడిలోని శివలింగాన్ని పెకలించడానికి ప్రయ త్నించి విఫలమయ్యారు. పురావస్తు శాఖ 30 ఏళ్ల క్రితం ఆలయాన్ని తమ పరిధిలోకి తీసుకున్నా ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. ఆలయానికి సరైన రహదారి కూడా లేదు. గాలిగోపురం శిథిలమై కూలడా నికి సిద్ధంగా ఉంది. ఎస్సార్బీసీ కాలువ నిర్మాణ సమయంలో బ్లాస్టింగ్‌ వల్ల గాలిగోపురం బీటలు వారాయి. పలుమార్లు గోపుర నిర్మాణానికి ప్రతిపాద నలు పంపినా దేవదా యశాఖ పట్టించుకో లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 


పూజలకు అర్చకులు కరువు

 రెండేళ్ల క్రితం ఆలయ అర్చకులు ప్రకాష్‌ మృతి చెం దడంతో స్వామివారికి పూజలు చేసే వారు కరువయ్యారు. అర్చ కుల వంశస్థులు స్థానికంగా లేకపోవ డంతో వేరే అర్చకుల సహకారంతో పూజలు  నిర్వహించాల్సి వస్తోంది. 


అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి

దేవదాయ, పురావస్తు శాఖ ఉన్నతాధికారుల నిర్ల క్ష్యంతోనే ఆలయానికి ఈ దుస్థితి ఏర్పడింది. దేవదాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ప్రతి యేటా ఆలయా నికి వచ్చే ఆదాయం గురించే చర్చిస్తారు తప్ప ఆలయ అభివృద్ధిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. శాశ్వత అర్చకుడిని ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎలాంటి చర్యలు లేవు. ఇప్పటికే వంటశాల మంటపం, కాపలాదారుల నివాసాలు శిథిలమై ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. దాతల సహకారంతో దాదాపు రూ.10 లక్షలతో భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశాం. 

- బాలశంకర్‌, ఆలయ మాజీ ధర్మకర్త, పాణ్యం 




Updated Date - 2022-01-22T04:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising