ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

ABN, First Publish Date - 2022-08-31T06:51:11+05:30

మండలంలోని తెర్నేకల్లు గ్రామంలో పోలీస్‌ పికెటింగ్‌ విధుల్లో ఉంటూ ఓ మహిళపై అత్యాచారాయత్నం చేసిన కానిస్టేబుల్‌ చంద్రబాబును ఎస్పీ సిద్ధార్థకౌసిల్‌ సస్పెండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవనకొండ, ఆగస్టు 30: మండలంలోని తెర్నేకల్లు గ్రామంలో పోలీస్‌ పికెటింగ్‌ విధుల్లో ఉంటూ ఓ మహిళపై అత్యాచారాయత్నం చేసిన కానిస్టేబుల్‌   చంద్రబాబును ఎస్పీ సిద్ధార్థకౌసిల్‌ సస్పెండ్‌ చేశారు.  తెర్నేకల్లు గ్రామంలో గత నెల రోజుల జరిగిన ఘర్షణ నేపథ్యంలో   పోలీస్‌ పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ చంద్రబాబు ఘర్షణలో కేసులో రిమాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి ఒంటరిగా ఉన్న మహిళను అత్యాచారం చేయబోయాడు. ఆమె కేకలు వేస్తూ ఇంట్లోంచి బైటికి రావడంతో   కానిస్టేబుల్‌  పరారయ్యాడు. గ్రామస్థుల  ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు ఈ సమాచారం వెళ్లింది.  ఈ సంఘటనపై విచారణ చేసి నివేదిక పంపాలని  ఎస్పీ పత్తికొండ డీఎస్పీ శ్రీనివాస్‌ను ఆదేశించారు.  పత్తికొండ రూరల్‌ సీఐ రామకృష్ణారెడ్డి, దేవనకొండ ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటనపై విచారణ జరిపి నివేదికను  ఎస్పీకి పంపారు. దీంతో ఎస్పీ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

 నిజమని తేలడంతో 

 కానిస్టేబుల్‌ చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో  ఎస్పీ సిద్ధార్థ్‌ కౌసిల్‌ నుంచి సస్పెన్షన్‌ ఉత్తర్వులు వచ్చాయని పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసులు మంగళవారం విలేఖర్లకు తెలిపారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎవరినీ ఉపేక్షించమని అన్నారు.  ఈ సమావేశంలో పత్తికొండ రూరల్‌ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. 


  


Updated Date - 2022-08-31T06:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising