ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి

ABN, First Publish Date - 2022-06-26T04:53:19+05:30

పెళ్లి అయిన కొన్ని గంట ల్లోనే నవ వరుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలోని బోయరే వుల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

పెళ్లి రోజు దిగిన ఫొటో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెలుగోడు, జూన్‌ 25: పెళ్లి అయిన కొన్ని గంట ల్లోనే నవ వరుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలోని బోయరే వుల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బంధు వులు, పోలీసుల కథనం మేరకు.. బోయ రేవుల గ్రామానికి చెందిన శివకుమార్‌ (26) జూపాడు బంగ్లా మండలం భాస్కరాపురం గ్రామానికి చెందిన శిరీషను శుక్రవారం వివాహమాడాడు. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో వరుడు శివకుమార్‌ ఆనందంగా గడిపాడు. అర్ధరాత్రి వరకు వరుడు, వధువులు సైతం నృత్యాలు సైతం చేస్తూ అందర్నీ అలరింపజేశారు. అనంతరం అందరూ నిద్రిస్తుండగా వరుడు శివకుమార్‌ బయటికి వెళ్లి వస్తానని బయలుదేరాడు. పెళ్లి ఇంటి నుంచి సుమారు 4 కిలో మీటర్ల దూరంలో నడుచుకుంటూ వెళ్లగా మోతుకూరు గ్రామ సమీపంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడి కక్కడే కుప్పకూలిపోయాడు. ఆ మార్గంలో వెళ్తున్న కొం దరు ప్రయాణి కులు కుటుంబ సభ్యులకు సమాచా రం అందించారు. హుటాహుటిన ప్రమా ద స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు శివకు మార్‌ను వైద్యం కోసం నంద్యాల ఆసుపత్రికి తరలిం చారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే నవ వరుడు పెళ్లి ఇంటి నుంచి ఒంటరిగా వెళ్లడం, ప్రమాదానికి గురి కావడం, వరుడు మెడలోని బంగారు గొలుసు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మృతుడి తండ్రి భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పరీక్ష నిర్వహించినట్లు ఎస్‌ఐ జగన్‌ మోహన్‌ తెలిపారు.

Updated Date - 2022-06-26T04:53:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising