ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ముగిసిన నవరాత్రి వేడుకలు

ABN, First Publish Date - 2022-10-05T06:30:38+05:30

దసరా వేడుకలను తొమ్మిది రోజుల పాటు నిర్వహించే దేవీ శరన్నవరాత్రోత్సవాలు కర్నూలు నగరంలో మంగళ వారం రాత్రి ఘనంగా ముగిసాయి.

లలితా పీఠంలో లక్ష కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 4: దసరా వేడుకలను తొమ్మిది రోజుల పాటు నిర్వహించే దేవీ శరన్నవరాత్రోత్సవాలు కర్నూలు నగరంలో మంగళ వారం రాత్రి ఘనంగా ముగిసాయి. బుధవారం నగర వాసు లు దసరా పండుగ నిర్వహించుకుంటున్నారు. కాగా.. దేవీ నవరాత్రి వేడుకల ముగింపు 9వ రోజున మంగళవారం అమ్మవారికి మహార్నవి పూజలు భక్తిశ్రద్ధలతో చేప ట్టారు. ఈ పూజల్లో భాగంగా వివిద కార్యా లయాలు, కర్మాగారాలు, వాహనాల వర్కుషాపులు, యం త్రాలు ఉపయోగించే యూనిట్‌ కేంద్రాలలో ఆయుధ పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాల్లో అమ్మవారికి 9వ రోజు మహిషాసురమర్దిని రూపంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, అర్చనలు, అష్టోత్తర పారాయణాలు చేపట్టారు. మించిన్‌బజారులోని పెద్ద అమ్మవారిశాలలో మహిషా సురమర్దినిగా, పూలబజారు లోని చిన్నఅమ్మవారిశాలలో కాళికాంబదేవిగా, వన్‌టౌన్‌లోని గీతామందిరంలో విజయదుర్గా దేవిగా, కాళికాంబ దేవాలయంలో మహిషాసుర మర్దినిగా, చిత్తారివీధిలోని నిమిషాంబ దేవాలయంలో, సప్తగిరినగర్‌లోని అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవార్లకు మహిషాసురమర్దిని అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.


టీటీడీ-హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో..

టీటీడీ-హిందూ ధర్మప్రచార పరిషత్‌, పాతనగరంలోని లలితా పీఠం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మహర్న వమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. లలితా సహస్ర నామస్తోత పారాయణం, హోమం, లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్య నిర్వాహకులు డా.మల్లు వెంకట రెడ్డి, లలితాపీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్యం స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-05T06:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising