26న జాతీయ మెగా లోక్ అదాలత్
ABN, First Publish Date - 2022-06-14T06:08:29+05:30
జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు 3వ అదనపు జిల్లా జడ్జి వాసు, ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ప్రసన్నలత తెలిపారు.
నంద్యాల (నూనెపల్లె), జూన్ 13: జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు 3వ అదనపు జిల్లా జడ్జి వాసు, ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ప్రసన్నలత తెలిపారు. సోమవారం నంద్యాలలోని కోర్టు భవనాల సముదాయంలో డీఎస్పీ రామాంజినాయక్‌తో పాటు నంద్యాల పోలీసు సబ్ డివిజన్‌లోని పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ పోలీసుస్టేషన్ల పరిధిలోని పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. సమీక్షలో సీఐలు రమణ, ఆదినారాయణరెడ్డి, పులి శేఖర్, మురళీమోహన్‌రావు, సురేష్‌బాబు, రవీంద్ర, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-14T06:08:29+05:30 IST