ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను నిప్పులాంటి మనిషిని.. నన్నెవరూ ఏమీ చేయలేరు.. : చంద్రబాబు

ABN, First Publish Date - 2022-05-19T19:52:41+05:30

తాను తప్పు చేయనని.. నిప్పులాంటి మనిషినని.. ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : తాను తప్పు చేయనని.. నిప్పులాంటి మనిషినని.. ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu) కర్నూలు వేదికగా వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool) కార్యకర్తలతో బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాము కన్నెర్ర చేస్తే సీఎం వైఎస్ జగన్‌ (CM Jagan) తట్టుకోలేరని ఒకింత హెచ్చరించారు. కర్నూలులో టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించి వైసీపీ జెండాలు (YSR Congress) పెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో వేధింపులు, అప్పులు, బాదుడే బాదుడు అని వ్యాఖ్యానించారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.


జగన్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు..

తెలుగుజాతి ఉన్నంతవరకూ టీడీపీ (TDP) ఉంటుంది. ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. టీడీపీని దెబ్బతీయాలని కొందరు ఎన్నో కుట్రలు చేశారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించాలి. ఒంగోలు (Ongolu) మహానాడు (Mahanadu) ద్వారా చర్చించుకుందాం. పైశాచిక ఆనందంతో జగన్ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై (Womens) అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్రం ఏమైనా జగన్ జాగీరా..?. తప్పుడు కేసులకు (Case) మా కార్యకర్తలు భయపడరు. జగన్ పాలనలో బాదుడే.. బాదుడు. రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోంది. నా జీవితంలో ఇంత విధ్వంస పాలన ఎప్పుడూ చూడలేదు. ఇదేంటి అని ప్రశ్నిస్తే వారిపైనే దాడులు చేస్తున్నారు. చట్టం (Law) కొందరికి చుట్టం కాదు. కావాలనే విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వంపై పోరాడే ప్రతి కార్యకర్త (Activist) ఒక వీరేడే. ఇంతవరకూ కర్నూలు జిల్లాకు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ (Industry) కూడా రాలేదు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. నదుల అనుసంధానం, పోలవరంతో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని కలలు కన్నాం. కానీ ఆ కలల్ని జగన్ చిదిమేశారు. మహానాడు నుంచి దృష్టి మళ్లించేందుకు వైసీపీ బస్సు యాత్ర (Bus-Yatra) ప్లాన్ చేసింది అని జగన్ సర్కార్‌పై (Jagan Sarkar) చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.



Updated Date - 2022-05-19T19:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising