ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతిభద్రతలకు పెద్దపీట: డీఎస్పీ

ABN, First Publish Date - 2022-04-24T05:15:33+05:30

శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నట్టు నంద్యాల డీఎస్పీ రామాంజినాయక్‌ తెలిపారు.

మాట్లాడుతున్న డీఎస్పీ రామాంజి నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (నూనెపల్లె), ఏప్రిల్‌ 23: శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నట్టు నంద్యాల డీఎస్పీ రామాంజినాయక్‌ తెలిపారు. ఎస్పీ రఘువీర్‌ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. శాంతి భద్రతలను పరి రక్షించడానికి పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండి అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయాలని ఆదేశించారు. పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌, అక్రమ మద్యం, గంజాయి, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై పూర్తిగా దృష్టి సారిస్తున్నామన్నారు. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచామన్నారు. నల్లమల సమీపంలో ఉన్న ఎర్రచందనం అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచామన్నారు. యువత మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాబ్లింగ్‌ల జోలికి వెళ్లి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. టూటౌన్‌ సీఐ రమణ, కమాండ్‌ కంట్రోల్‌ సీఐ ఇస్మాయిల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-24T05:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising