ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మున్సిపల్‌ కార్యాలయం ముట్టడి’

ABN, First Publish Date - 2022-03-05T05:48:42+05:30

నంద్యాల పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్‌, ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతుసంఘాలు శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల టౌన్‌, మార్చి 4: నంద్యాల పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్‌, ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతుసంఘాలు శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈసందర్భంగా నాయకులు బాబాఫకృద్దీన్‌, ప్రసాద్‌, నాగరాముడు మాట్లాడుతూ పట్టణంలోని వార్డుల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా సమస్యలు నెలకొని ఉన్నాయని అన్నారు. కుందూనది పరివాహక ప్రాంతాల్లో వరద రక్షణ గోడల నిర్మాణం పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారని అన్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు ప్రారంభించాలని, పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్స్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 42వార్డులలోని సీసీ రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటికి మరమ్మతులు చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, సుబ్బరాయుడు, సోమన్న, ధనుంజయుడు పాల్గొన్నారు. 



Updated Date - 2022-03-05T05:48:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising