ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబ్బాబాబ్బాబు..!

ABN, First Publish Date - 2022-06-25T04:45:27+05:30

అచ్చం పోకిరి సినిమాలోని సన్నివేశం ఇది. నటులు వేణు, ఆలీతోపాటు యాచకులంతా కలిసి బాబ్బాబాబ్బాబు..

ఎమ్మెల్యే కారుకు అడ్డంగా వెళ్లి బిచ్చం బిచ్చమంటూ అడుగతున్న యాచకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఎమ్మెల్యేని వదలని యాచకులు 
  2. బిత్తరబోయిన బాలనాగిరెడ్డి

మంత్రాలయం, జూన 24: అచ్చం పోకిరి సినిమాలోని సన్నివేశం ఇది.   నటులు వేణు, ఆలీతోపాటు యాచకులంతా కలిసి బాబ్బాబాబ్బాబు.. అంటూ బ్రహ్మానందంను డబ్బుల కోసం వెంట పడతారు. సరిగ్గా అలాగే  మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని యాచకులు చుట్టుముట్టారు. ధర్మం చేయండి బాబు అంటూ ఆయన కారు చుట్టూ మూగారు. దీంతో ఎమ్మెల్యేకు   బిత్తరపోయే పరిస్థితి ఏర్పడింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ఆర్యవైశ్య సత్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గేటు వద్ద దాదాపు 20 మంది యాచకులు  ఆయన కారుకు అడ్డుగా నిలబడ్డారు.   భక్తులు, ప్రజలు  తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారేమోనని భావించిన ఎమ్మెల్యే కారు అద్దాలు తీశారు. దీంతో ఒక్కసారిగా బిచ్చగాళ్లంతా కలిసి ధర్మం చేయండి బాబూ అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు. డబ్బులు ఇవ్వాల్సిందే అని  పట్టుబట్టారు. మరి కొంత మంది కారు మీదకు ఎగబడుతుండగా.. సూగూరు వీఆర్వో భీముడు వారిని అడ్డుతొలగించారు. ఈ ఘటనతో సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విస్తుపోయారు. అయితే ముందు కారులో ఉన్న మాజీ ఎంపీపీ, ఎమ్మెల్యే అన్న సీతారామిరెడ్డి యాచకులకు డబ్బులు ఇచ్చినా కొంత మందికి అందకపోవడంతో నిరుత్సాహంతో వెనుదిరిగారు.


Updated Date - 2022-06-25T04:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising