ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన మొహర్రం వేడుకలు

ABN, First Publish Date - 2022-08-10T05:34:13+05:30

మండలంలోని గ్రామాల్లో మొహర్రం వేడుకలు మంగళవారంతో ముగిశాయి.

కోడుమూరు: వర్కూరులో నిమజ్జనానికి తరలివెళ్తున్న పీర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోడుమూరు(రూరల్‌), ఆగస్టు 9: మండలంలోని గ్రామాల్లో మొహర్రం వేడుకలు మంగళవారంతో ముగిశాయి. గత వారం రోజులుగా పీర్లను ఊరేగించి, పూజలు చేశారు. అగ్నిగుం డం చుట్టూ యువకులు చేరి డప్పుశబ్దాలకు చిందులు వేశారు. భక్తులు పీర్లచావిడిలో పీర్ల ను దర్శించుకుని పూజలు చేసి చదివింపులు సమర్పించారు. చివరిరోజున పీర్లను మేళతా ళాల మధ్య వీధుల గుండా ఊరేగింపుతో తీసు కెళ్లి నిమజ్జనం చేశారు.

గూడూరు:
మండలంలోని గ్రామాల్లో మెహర్రం వేడుకలు ఘనంగా ముగిసాయి. మంగళవారం మండలంలోని కె నాగలాపురం, పెంచికల పాడు, బుడిదపాడు, చనుగోండ్ల గ్రామాల్లో మెహర్రం వేడుకలను ఘనం గా నిర్వహించారు. గ్రామాల్లో పీర్లను ఊరేగించారు.

ఓర్వకల్లు: మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచెర్ల, నన్నూ రు, లొద్దిపల్లె, ఉయ్యాలవాడ, మీదివేముల, ఉప్పలపాడు, హుశేనాపురం, చెన్నంచెట్టిపల్లె, సోమయాజులపల్లె, కాల్వ, శకునాల తదితర గ్రామాల్లో చావిడిలో కొలువుదీరిన పీర్లకు ప్రజలు పూజలు చేశారు. పీర్లతో అగ్ని గుండంలో ప్రవేశం చేశారు. పీర్లను గ్రామాల్లో ఉన్న కుంటలు, చెరు వుల్లో నిమజ్జనం చేసి, అనంతరం పీర్లను చావిడిలో భద్రపరిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా ఎస్‌ఐ మల్లికార్జున ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Updated Date - 2022-08-10T05:34:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising