ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-05-19T05:12:29+05:30

మండలంలోని ఈర్లదిన్నె గ్రామానికి చెందిన ముక్కిడి వెంకటేశ (38) మంగళవారం రాత్రి సి బెళగల్‌లో జరిగిన ఓ వివాహంలో బ్యాండు మేళం వాయించి రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి బయల్దేరాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సి. బెళగల్‌, మే 18: మండలంలోని ఈర్లదిన్నె గ్రామానికి చెందిన ముక్కిడి వెంకటేశ (38) మంగళవారం రాత్రి సి బెళగల్‌లో జరిగిన ఓ వివాహంలో బ్యాండు మేళం వాయించి రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి బయల్దేరాడు.  ఇనగండ్ల క్రాస్‌ రోడ్డు దాటాక  పోలకల్లు కాలువ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు గ్రామంలో వ్యవసాయ కూలి పనులతోపాటు చుట్టు పక్కల ఊళ్లలో వివాహ వేడు కలకు బ్యాండు మేళం వాయించుతూ కుటుంబాన్ని పోషించుకుం టున్నాడు. ఇంటి పెద్ద మృతితో  కుటుంబం సంక్షోభంలో పడిందని, ప్రభుత్వం ఆదుకో వాలని రెవెన్యూ అధికారులను మృతుని అన్న  వెంకటేశ కోరారు. అతడి ఫిర్యా దు మేరకు కోడుమూరు సీఐ శ్రీధర్‌ కేసు నమోదు చేసుకొన్నారు. మృతదేహాన్ని పోస్టు మర్టం నిమిత్తం తరలించారు. మృతునికి భార్య యువరాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.  

 సర్వే తెచ్చిన చిక్కు... ఘర్షణలో అన్న మృతి

పత్తికొండ(దేవనకొండ), మే 18: వారసత్వంగా వచ్చిన పొలం సర్వే విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో అన్న మృతి చెందాడు.  దేవనకొండ మండలం పల్లెదొడ్డి గ్రామానికి చెందిన చిన్న అంజనయ్యకు శ్రీరాములు, లింగన్న ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ మధ్య పొలం పంపకాల పూర్తయ్యాయి.   మరో 4 ఎకరాల పొలం హద్దులు తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ్ముడు లింగన్న సర్వే కోసం రెవెన్యూ కార్యాలయంలో డబ్బులు చెల్లించాడు. బుధవారం సర్వేకు అధికారులు వస్తారని తెలిసి  మన ఇద్దరి మధ్య ఉన్న పొలంలో హద్దులు దేనికి అని   అడిగేందుకు శ్రీరాములు తమ్ముడి ఇంటికి వెళ్లాడు. అయితే మాటామాట పెరగడంతో లింగన్న బంధువులు శ్రీరాములును బలంగా తోశారు. ఆయన కింద పడి  అక్కడికక్కడే మృతి చెందాడు. లింగన్న బంధువులు దాడి చేయడంతోనే శ్రీరాములు మృతి చెందాడంటూ అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం తాను సెలవులో ఉన్నానని, విధుల్లోకి  వెళ్లగానే వివరాలు తెలుసుకుంటానని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. 


Updated Date - 2022-05-19T05:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising