ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి

ABN, First Publish Date - 2022-11-30T01:18:08+05:30

గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ పి. కోటేశ్వరరావు సూచించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు

కర్నూలు(కల్చరల్‌), నవంబరు 29: గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ పి. కోటేశ్వరరావు సూచించారు. మంగళవారం జడ్పీలోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2023-24వ సంవత్సరానికి తయారు చేయడానికి రెండు రోజుల టీఓటీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రతి మండలం నుంచి నలుగురు టీఓటీ (ఎంపీడీవో, ఈవోఆర్డీ, పంచాయతీ సెక్రటరీ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్‌ కోటేశ్వరరావుతో పాటూ జడ్పీ ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి ప్రస్తుతం మనకు ఉన్న పథకాలు నవరత్నాలు, ఉపాధి హామీ పథకం, నాడు నేడు, జలజీవన్‌ మిషన్‌, విద్య వైద్య రంగాలకు సంబంధించిన పథకాల ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించే దిశగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు శిక్షణ ఇస్తామని అన్నారు. జడ్పీ చైౖర్మన్‌ మాట్లాడుతూ గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అందుకు తగ్గ ప్రణాళిక వేసుకొని గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పారు. జడ్పీ సీఈవో నాసరరెడ్డి మాట్లాడుతూ మండల, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారీలో వైఎస్సార్‌ క్రాంతి పథకం, ఉపాధి హామీ, ఫారెస్ట్‌, పంచాయతీరాజ్‌, నీటి సరఫరా తదితర శాఖలు కూడా తమ కార్యాచరణ ప్రణాళికలను మండల, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో సమ్మిళితం చేసి సంబంధిత ప్రజలకు గరిష్ఠ ప్రయోజనాం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీవో టి. నాగరాజ నాయుడు, అధికారులు, రిసోర్స్‌ పర్సన్లు పాల్గొన్నారు.

హైరిస్క్‌ గర్భిణుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: కలెక్టర్‌

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో హైరిస్క్‌ గర్భిణుల ఆరోగ్య పరిస్థి తులను ప్రసవం వరకు పర్యవేక్షించాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అధికా రులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో వైద్యశాఖ ప్రోగ్రామ్‌ ఆఫీసర్స్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, సూపర్‌వైజర్లతో వైద్యశాఖ అంశాలు, గర్భిణుల ఆరోగ్య అంశాలపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 30 వేల మంది గర్భిణులకు గానూ 5,112 మంది హైరిస్క్‌ గర్భిణులు ఉన్నారని తెలి పారు. వీరి వైద్య, మహిళ శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. హైరిస్క్‌ గర్భిణులు ప్రసవానికి ఒక వారం ముందే ఆసుపత్రుల్లో చేర్పించేందుకు వైద్యాధికారులు చర్యలు తీసుకోవా లని, దీనిపై తరచూ సమీక్షిస్తానని చెప్పారు. అలాగే హైరిస్క్‌ గర్భిణుల ఆరోగ్యంపై ఫ్యామిలీ ఫిజీషియన్లకు చూపించేలా అంగన్‌వాడీ టీచర్లు శ్రద్ధ చూపాలన్నారు. టీబీ కేసులకు సంబంధించి 36,395 మందికి పరీక్షలు చేయగా.. 4676 మందికి పాజిటివ్‌ వచ్చిందని టీబీ నియంత్రణ అధికారి భాస్కర్‌ తెలిపారు. నిక్షయ మిత్ర యాప్‌లో టీబీ రోగులకు ఫుడ్‌ బాస్కెట్‌ ఇవ్వడానికి డోనర్లు, అధికారులను నమోదు చేయించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే కుష్ఠు గుర్తింపు పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన 25 మంది రోగులకు మంచి వైద్యం అందించాలన్నారు. 122 పాఠశాలల్లో 270 మంది విద్యార్థులకు ఫ్లోరోసిస్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను అందజేయాలని కలెక్టర్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ను ఆదేశించారు. డెంగీ, మలేరియా నియంత్రణకు కూడా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణ పురోగతిని గుర్తించి డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య అడిగి తెలుసుకు న్నారు. ఐసీడీఎస్‌ పీడీ కేఎల్‌ఆర్‌కే కుమారి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ రఘు, వైద్య ఆరోగ్యశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T01:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising