ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేద్దాం

ABN, First Publish Date - 2022-03-05T05:38:47+05:30

డోన్‌ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేద్దామని ఆ పార్టీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.

సుబ్బారెడ్డిని సన్మానిస్తున్న తెలుగు యువత నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోన్‌ (రూరల్‌), మార్చి 4: డోన్‌ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేద్దామని ఆ పార్టీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం నియోజకవర్గ తెలుగుయువత అధికార ప్రతినిధి కమలాపురం రమేష్‌, కార్యనిర్వహక కార్యదర్శి మిద్దెపల్లి సుదాకర్‌, పలువురు తెలుగు యువత నాయకులు సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అంతా అధర్మ పాలన సాగిస్తోందన్నారు. విధ్వంసాలు, వేధింపులు, అరాచకాలతో ప్రజల భవిష్యత్తును అంధాకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు. వైసీపీ నియంతృత్వ పోకడలపై టీడీపీ ధర్మపోరాటం చేస్తోందన్నారు.రానున్న రోజుల్లో  ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలకు సన్నద్ధం కావాలని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ నిజస్వరూపం ప్రజలకు అర్థమైపోయిందని, మంచి పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబును ప్రజలే సీఎం పదవిలో కూర్చోబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, డోన్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, ఆలా మల్లికార్జునరెడ్డి, మిద్దెపల్లి గోవిందు, మాజీ ఎంపీటీసీ మల్లేశ్వరయ్య, మిద్దెపల్లి రవి, అనుంపల్లె రంగనాయకులు, కల్లూరి శివన్న, రామనాథం, కృష్ణారెడ్డి, వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.


‘వైసీపీ మోసాలను ఎండగడదాం’ 


వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తెద్దామని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం డోన్‌ మండలంలోని కొత్తబురుజు గ్రామంలో ఆడపడుచుల ఆత్మగౌరవ సభను టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, కమలాపురం సర్పంచ్‌ రేగటి అర్జున్‌ రెడ్డి, నంద్యాల నియోజకవర్గ కార్యదర్శి అభిరెడ్డిపల్లె గోవిందు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, దేవరబండ వెంకటనారాయణ, గంధం శ్రీనివాస్‌, గోవిందరెడ్డి, మిద్దెపల్లి గోవిందు, ఎల్‌ఐసీ శ్రీరాములు, మండల తెలుగు యువత అధ్యక్షుడు సుధాకర్‌ యాదవ్‌, బాలు, కాసీ పాల్గొన్నారు.


Updated Date - 2022-03-05T05:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising