ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీకి బుద్ధి చెబుదాం: సుబ్బారెడ్డి

ABN, First Publish Date - 2022-08-04T06:05:56+05:30

పట్టణంలో వైసీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని, వారికి బుద్ధి చెబుదామని టీడీపీ డోన ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.

బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న ధర్మవరం సుబ్బారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోన్‌, ఆగస్టు 3: పట్టణంలో వైసీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని, వారికి బుద్ధి చెబుదామని టీడీపీ డోన ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. బుధవారం పట్టణంలోని 18, 19 వార్డులలో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ మంత్రి బుగ్గన అనుచరులు ఇష్టానుసారంగా భూదందాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క సెంటు భూమి కూడ కబ్జా కానివ్వమని చెప్పిన మంత్రి పట్టణంలో భూ కబ్జాలు జరుగుతున్నా నోరు మెదపకపోవడం విచారకరమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దీనివలన పేదలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, పట్టణ అధ్యక్షుడు సీయం శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, యువ నాయకులు గౌతంరెడ్డి, అబ్బిరెడ్డిపల్లి గోవిందు, కుమ్మరి సుధాకర్‌, సాగర్‌యాదవ్‌, కేబుల్‌ కిరణ్‌, మాబు హుసేన్‌,   ఎర్రిస్వామి గౌడు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-04T06:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising