ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2022-05-22T06:36:01+05:30

రెడ్‌క్రాస్‌ సొసైటీ లో పని చేసే ల్యాబ్‌ టెక్నీషియన్‌ రామాంజనే యులు పెట్రోల్‌ పోసుకొని శనివారం ఆత్మహ త్యాయత్నం చేశారు.

డీపీవో కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న రామాంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీపీవో కార్యాలయంలో ఘటన

కర్నూలు(కలెక్టరేట్‌) మే 21: రెడ్‌క్రాస్‌ సొసైటీ లో పని చేసే ల్యాబ్‌ టెక్నీషియన్‌ రామాంజనే యులు పెట్రోల్‌ పోసుకొని శనివారం ఆత్మహ త్యాయత్నం చేశారు. కర్నూలు జిల్లా పంచాయతీ కార్యాలయంలోని డీపీవో సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో సిబ్బంది అడ్డుకున్నారు. ఇంతలో విలేకరులు రావడంతో వారితో రామాంజనేయులు మాట్లాడారు. రెడ్‌క్రాస్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా 11 ఏళ్లుగా పని చేస్తున్న తన మీద అవినీతి ఆరోపణలు చేసి హెడ్‌ ఆఫీసు నుంచి తొలగించారని తెలిపారు. తన తొలగింపులో రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయ ఏవో సుబ్బారెడ్డి, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కుమార స్వామి పాత్ర కీలకంగా ఉందని ఆరోపించారు. రెడ్‌క్రాస్‌కు స్పెషల్‌ ఆఫీసర్‌గా ఉన్న డీపీవో నాగరాజనాయుడు హెడ్‌ ఆఫీసు నుంచి వచ్చిన ఉత్తర్వులను తనకు ఇచ్చారని చెప్పారు. ఈ అంశంపై డీపీవో నాగరాజునాయుడు మాట్లాడు తూ రామాంజనేయులుపై అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. గతంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ అధి కారులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. రెండు మూడుసార్లు హెచ్చరించి వదిలేశామని వివరించారు. ామాంజనేయులులో మార్పు రాకపోవడంతో విచారణ జరిపి రెడ్‌క్రాస్‌ సొసైటీ హెడ్‌ ఆఫీసుకు నివేదిక పంపారన్నారు. దీంతో వారు రామాంజనేయులను సర్వీసు నుంచి తొలగించారని తెలిపారు.  


Updated Date - 2022-05-22T06:36:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising