ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీగిరిపై కూష్మాండ దుర్గ

ABN, First Publish Date - 2022-09-30T05:58:36+05:30

శ్రీశైలం క్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం అమ్మవారు కూష్మాండ దుర్గగా భక్తులకు దర్శనం ఇచ్చారు.

కైలాసవాహనంపై విహరిస్తున్న స్వామి, అమ్మవారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వామి, అమ్మవార్లకు కైలాసవాహన సేవ

శ్రీశైలం, సెప్టెంబరు 29: శ్రీశైలం క్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం అమ్మవారు కూష్మాండ దుర్గగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణాలు, చండీహోమం, పంచాక్షరీ, జపానుష్ఠానాలు, చండీపారాయణం, చతుర్వేద పారాయణాలు, కుమారిపూజలు నిర్వహించారు. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు చేశారు.

 స్వామి, అమ్మవార్లకు కైలాసవాహన సేవ

నవదుర్గా స్వరూపాల్లో నాలుగో రూపమైన కూష్మాండ దుర్గ ఎనిమిది భుజాలతో ఆరోగ్య ప్రదాయినిగా భక్తులను కటాక్షించారు. ఈ దేవిని అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు. సృష్టికి ఆది స్వరూపిణి అయిన కూష్మాండ దుర్గను పూజిస్తే ఆయువు, యశస్సు పెరుగుతాయని నమ్మకం. వాహనసేవలలో భాగంగా కైలాసవాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులనుజేసి సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వర్షం కారణంగా గ్రామోత్సవం జరగలేదు. ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తులను ఊరేగించారు.

నేడు అమ్మవారిని స్కందమాతగా అలంకరిస్తారు. స్వామి, అమ్మవార్లకు శేషవాహనసేవ చేస్తారు.

Updated Date - 2022-09-30T05:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising