ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool జిల్లా: ఆలూరు (Aluru) కల్లివంక వాగులో కొట్టుకుపోయిన Car లభ్యం

ABN, First Publish Date - 2022-06-06T17:09:09+05:30

ఆలూరు (Aluru) మండలం, కల్లివంక (Kallivanka) వాగులో కొట్టుకుపోయిన కారు (Car) లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Kurnool జిల్లా: ఆలూరు (Aluru) మండలం, కల్లివంక (Kallivanka) వాగులో కొట్టుకుపోయిన కారు (Car) లభ్యమైంది. అందులో ఉన్న వ్యక్తి సురక్షితంగా ఉన్నారు. ఆదివారం రాత్రి వరద ఉధృతికి కల్లివంక వాగులో కారు కొట్టుకుపోయింది. గుంతకల్లు నుంచి ఆలూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరదను గుర్తించకుండా కర్నాటకు చెందిన వ్యక్తి జావిద్ అన్సారీ కారుతో వెళ్లారు. స్థానికులు చూస్తుండగానే కారు వరద ధాటికి కొట్టుకుపోయింది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో కొట్టుకుపోయిన కారు నాలుగు కి.మీ. దూరంలో ఉండటాన్ని గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తి కొంచెం దూరంలో ఒడ్డుపై సురక్షితంగా ఉండడాన్ని రిస్క్యూ సిబ్బంది గమనించారు.


ప్రమాదం ఎలా జరిగిందని పోలీసులు జావిద్ అన్సారీని ప్రశ్నించారు. తాను పీహెచ్‌డీ అడ్మిషన్ కోసం బెంగళూరు నుంచి గుల్బర్గాకు కారులో ఒక్కడినే వెళ్తుండగా ఆలూరు సమీపంలో కల్లివంక వాగులో కారు కొట్టుకు పోయిందన్నారు. కారు నాలుగు కిలోమీటర్ల మేర నీటిలో కొట్టుకు పోయిందన్నారు. దీంతో కారు డోర్ తీసి నీళ్లలో దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరి.. రాత్రంతా వాగు ఒడ్డున కూర్చున్నట్లు ఆయన చెప్పారు. ఎవరికీ ఫోన్ చేయడానికి కూడా అవకాశం లేదని, కారులోనే సర్టిఫికేట్లు, సెల్ ఫోన్  ఉండిపోయాయన్నారు. తెల్లవారిన తర్వాత కారు ఎక్కడుందోనని వెతికానని నాలుగు కి.మీ. దూరంలో ఉండటాన్ని గమనించి ఒడ్డునే కూర్చున్నానని జావిద్ అన్సారీ పోలీసులకు వివరించారు.

Updated Date - 2022-06-06T17:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising