ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు: టోల్‌గేట్ దగ్గర లారీ డ్రైవర్ హల్ చల్

ABN, First Publish Date - 2022-04-27T21:02:56+05:30

టోల్‌గేట్ దగ్గర ఓ లారీ డ్రైవర్ హల్ చల్ చేశాడు. లారీని ఆపకుండా వెళ్లడంతో టోల్‌గేట్ సిబ్బంది వెంబడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: టోల్‌గేట్ దగ్గర ఓ లారీ డ్రైవర్ హల్ చల్ చేశాడు. లారీని ఆపకుండా వెళ్లడంతో టోల్‌గేట్ సిబ్బంది వెంబడించారు. లారీ ముందు భాగంలో టోల్‌గేట్ ఉద్యోగి వేలాడుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్నూలు జిల్లా, కృష్ణగిరి మండలం, అమకతాడు టోల్‌గేట్ దగ్గర రాజస్థాన్‌కు చెందిన లారీ వచ్చింది. అయితే టోల్ చార్జీ చెల్లించకుండా వెళ్లేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో అడ్డుకున్న టోల్ ప్లాజా ఉద్యోగి లారీ ముందు భాగంలో నిలబడ్డాడు. అయినా పట్టించుకోని డ్రైవర్ లారీతో అలాగే వెళ్లిపోయాడు. దాదాపు 10 కి.మీ. దూరం లారీకి వేలాడుతూనే ఉండిపోయాడు. దీంతో టోల్‌గేట్ పోలీసులకు సమాచారం అందించారు. హైవేపై పోలీసులు లారీని ఆపడంతో ఉద్యోగి కిందికి దిగి ఊపిరిపీల్చుకున్నాడు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2022-04-27T21:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising