ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఆదోని నియోజకవర్గం

ABN, First Publish Date - 2022-09-06T16:42:46+05:30

ఆదోని (Adoni) నియోజవర్గం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా (Kurnool Dist.): ఆదోని (Adoni) నియోజవర్గం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఆరు పంచాయతీలు, మూడు భూ దందాలుగా విరాజిల్లోతూ.. ఎమ్మెల్యేల పుత్రరత్నాలు కోట్లకు పడగలెత్తుతున్నారు. అధికారం ఉండగానే వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి (MLA Sai Prasad Reddy) తమ చేతికి అవినీతికి మరక అంటకుండా  పుత్రరత్నాలతో నాలుగు రాళ్లు వెనకుసుకుంటున్నారు. కర్నూలు జిల్లా, ఆదోని శాసనసభ్యుడు పుత్రరత్నం అవినీతి భాగోతం ఇది.


కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కుటుంబ పంచాయతీల పేరుతో కారుచౌకగా కొని పెద్ద ఎత్తున భూ దందాలు చేస్తున్నారు. అధికార దర్పంతో ఏం చేసినా చెల్లుతోందన్న ధీమాతో.. వైసీపీ నేతలు వివాదాల్లో ఉన్న భూములను టార్గెట్ చేసి.. వారి వద్ద నుంచి తక్కువ ధరకు కొని, భూ అవినీతికి తెరతీస్తున్నారు. ఆదోని పురపాలక సంఘం పరిధిలోని భూముల ధరలు పెరగడంతో పొలాల ధరలు ఆకాశాన్నంటాయి. అయితే ఇక్కడి నేతలు వివాదాల్లో ఉన్న భూముల వివరాలను తెలుసుకుని, వారితో సంప్రదించి భూములు అమ్మేలా ఉంటే ఎలాంటి కేసులు ఉన్నా.. ఎమ్మెల్యే చూసుకుంటారని చెబుతున్నారు. లేకపోతే ఆయా పొలాల జాబితాను రెడ్ మార్క్ జాబితాలో పెట్టమని అధికార్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బాధితులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయకపోవడంతో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు మరింత మితిమీరిపోయాయి.


ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని పర్వతాపురంలోని సర్వే నెం. 112సీ1లోని 5.29 ఎకరాల్లో.. మూడెకరాలు షంషుద్దీన్ అనే వ్యక్తికి వారసత్వంగా సంక్రమించింది. అదే సర్వేనెంబర్‌లోని మిగిలిన 2.29 ఎకరాల భూమిని షంషుద్దీన్ తన అక్కలకు ఇవ్వకుండా మొత్తం భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేశారు. బతుకుతెరువుకోసం బెంగళూరుకు వెళ్లిన షంషుద్దీన్ మొదటి భార్య పిల్లలకు విషయం తెలియడంతో అప్పట్లో లావాదేవీలు నిలిచిపోయాయి. 2019 కరోనా సమయం నుంచి ఎమ్మెల్యే అనుచరులు మల్లికార్జున, ఎర్రిస్వాములు, ఎమ్మల్యే కుమార్తె గౌతమీ రెడ్డి, కుమారుడు జై మనోజ్ రెడ్డిల భాగస్వామ్యంతో పంచాయతీ భూములను కొని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా ఎదురుమాట్లాడితే వారిని అధికార దర్పంతో నోళ్లు మూయించేస్తున్నారు. 

Updated Date - 2022-09-06T16:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising