ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో సరే.. నిబంధనలేవీ..?

ABN, First Publish Date - 2022-07-06T06:44:44+05:30

జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారుల ఎదురు చూపు

కర్నూలు(అగ్రికల్చర్‌), జూలై 5: జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో రైతులు బోర్లలో కాస్తో.. కూస్తో మిగిలిన నీటితో పంటలకు తడి అందించు కోడా నికి డ్రిప్‌ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రైతుల మొరను ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుత ఖరీ్‌ఫలోనైనా డ్రిప్‌ పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులను సమీకరించి ఆందోళనలు చేపడుతామని రైతు సంఘాలు హెచ్చరించాయి. దీంతో మరోదారి లేక రెండు నెలల కిందట ప్రభుత్వం డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాల ఏర్పాటు కోసం జీవో జారీ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి నిబంధనలు వచ్చేం త వరకు తాము డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాల కోసం రైతుల పేర్లను నమోదు చేసుకోలేమని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో నిబంధనలు జారీ చేయకున్నా అధికారులు గ్రామాలకెళ్లి రైతుల వెంట బడి పరికరాల కోసం వారిని ఒప్పించి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటికీ దాదాపు 5వేల మంది పేర్లను డ్రిప్పు పరికరాల కోసం నమోదు చేసుకున్నారు. అయితే.. నిబంధనలు జారీ కాకపోవడం వల్ల రైతుల నుంచి ఎంత డబ్బు కట్టించుకోవాలో తెలియక అధికారులు తలపట్టుకూర్చున్నారు.

Updated Date - 2022-07-06T06:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising