ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శుభలేఖపై జనసేన మేనిఫెస్టో

ABN, First Publish Date - 2022-06-07T06:26:44+05:30

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌పై ఓ అభిమాని వినూత్నరీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు.

జనసేన మేనిఫెస్టోతో రూపొందిన శుభలేఖ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  పవన్‌కల్యాణ్‌పై వినూత్న రీతిలో అభిమానం


 ఆత్మకూరు, జూన్‌ 6: జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌పై ఓ అభిమాని వినూత్నరీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. శుభలేఖపై జనసేన మేనిఫెస్టోను ముద్రించాడు. వివరాల్లోకి వెళితే... పాములపాడు మండలం లింగాల గ్రామానికి చెందిన పూజల హనుమంతరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడైన పూజల భాస్కరరెడ్డి తొలి నుంచీ పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమాని. వీరి కుటుంబ సభ్యులు వివిధ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేస్తూ వచ్చారు. తన సోదరుడు పూజల రామేశ్వరరెడ్డికి కూడా పవన్‌కల్యాణ్‌ అంటే అభిమానం. ఈ క్రమంలోనే పూజల భాస్కరరెడ్డికి ఈ నెల 10న జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, గంగుపేట గ్రామానికి చెందిన పద్మభూమిక అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో భాస్కరరెడ్డి తన పెళ్లిపత్రికలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఫోటోను... తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ముద్రించాడు. ఈ శుభలేఖలోని అంశాలు మండలంలో చర్చనీయాంశమయ్యాయి.

Updated Date - 2022-06-07T06:26:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising