ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jairam Ramesh: తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే...

ABN, First Publish Date - 2022-10-04T18:23:31+05:30

భారత్ జోడో యాత్ర (Jodo Yatra) తమిళనాడు (Tamilnadu), కేరళ (Kerala) రాష్ట్రాల్లో పూర్తయిందని జైరాం రమేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (Kurnool): రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రారంభించిన భారత్ జోడో యాత్ర (Jodo Yatra) తమిళనాడు (Tamilnadu), కేరళ (Kerala) రాష్ట్రాల్లో పూర్తయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ (Jairam Ramesh) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 18న ఏపీ కర్నూలు జిల్లా, ఆలూరు ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర ఉంటుందని, 4 రోజులు పాటు 85 కి.మీ. సాగుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా (Special Status) ఫైల్ పైనే అని స్పష్టం చేశారు. టిఆర్ఎస్.. బీఆర్ఎస్ కాదని, టిఆర్ఎస్ విఆర్ఎస్ తప్పదని జైరాం రమేష్ జోస్యం చెప్పారు.


జోడో యాత్రపై బీజేపీ, మిత్రపక్షాలు విషం చిమ్ముతున్నాయని జైరాం రమేష్ మండిపడ్డారు. తెలుగులో భారత్ జోడో థీమ్ పాట 18న విడుదల చేస్తామన్నారు. ఆర్థిక అసమానత పెరగడం, కుల, మత, బాషా, సామాజిక విభజన, రాజకీయ కేంద్రీకృతం..వీటికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత్ జోడో యాత్రలో ప్రజల స్పందనను చూసి భయపడుతున్నారన్నారు. కాంగ్రెస్‌కు భారత్ జోడో యాత్ర సంజీవిని అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-10-04T18:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising