ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగన్‌ మాయమాటలు నమ్మొద్దు’

ABN, First Publish Date - 2022-03-05T05:39:22+05:30

సీఎం జగన్‌ మాయమాటలు చెప్పి పాలన సాగిస్తున్నారని, ప్రజలు నమ్మి మోసపోవద్దని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రాలయం, మార్చి 4: సీఎం జగన్‌ మాయమాటలు చెప్పి పాలన సాగిస్తున్నారని, ప్రజలు నమ్మి మోసపోవద్దని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య అన్నారు. శుక్రవారం మంత్రాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అమలు చేసిన పతకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయని, ఆయన కుమారుడు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న పాలన మోసపూరితమైనదని ఆరోపించారు. మాధవరంలో నెలకొల్పిన మారుతి ఐరన్‌ ఫ్యాక్టరీ కాలుష్యంతో పంటలు, పశువులు, ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే మాధవరం స్టీల్‌ ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం, నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్‌ యాదవ్‌, సీపీఐ మండల నాయకులు లోకేష్‌, ఎల్లప్ప, వీరేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ తాలుకా ప్రధాన కార్యదర్శి థామస్‌, రఘు, వీరేష్‌, ఈరన్న, రామాంజినేయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T05:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising