ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాల్వబుగ్గ ఆలయానికి రూ.9,59,500 ఆదాయం

ABN, First Publish Date - 2022-10-11T06:02:35+05:30

బుగ్గరామేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఆలయ చైర్మన్‌ గుర్రాల చెన్నారెడ్డి, ఓర్వకల్లు ఈవో మద్దిలేటి, కాల్వబుగ్గ ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓర్వకల్లు, అక్టోబరు 10: బుగ్గరామేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఆలయ చైర్మన్‌ గుర్రాల చెన్నారెడ్డి, ఓర్వకల్లు ఈవో మద్దిలేటి, కాల్వబుగ్గ ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించారు. ఈ ఏడాది వేలం పాటల ద్వారా రూ.9,59,500  ఆదాయం సమకూరినట్లు ఈవో డీఆర్‌ కేవీ ప్రసాద్‌ తెలిపారు. దేవాలయానికి సంబంధించిన షాపింగ్‌, తాత్కాలిక కల్యాణ మండపాలు, టెంకాయ చిప్పలు పోగు చేసుకునే హక్కు, చెప్పుల స్టాండు, మూడు అంగళ్లు, ఐస్‌ క్రీమ్‌ అమ్ముకునే హక్కు, టీటీడీ కల్యాణ మండపంలో సామగ్రి సప్లయ్‌ చేసుకునే హక్కుకు వేలం పాటలు నిర్వహించారు. ఈ వేలం పాటలు ఈవో మద్దిలేటి పర్యవేక్షణలో జరిగాయి. గత ఏడాది రూ.6,16,000 వేలం పాట ద్వారా ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.9,59,500లు పాటాదారులు పాట పాడి దక్కించుకున్నారు. అయితే.. రూ.3,43,000 అదనంగా ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. అలాగే దేవస్థానంలో కేటాయించిన రూములో టెంకాయలు అమ్ముకునే హక్కుకు పాటాదారులు ఎవరూ రానందున టెంకాయల వేలం పాటను రద్దు చేసినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనా రాయణ శర్మ, కల్లె నరసింహ శర్మ, ధర్మకర్తలు ఆకుల మహేష్‌, నాగశేషయ్య, సుబ్బయ్య, లక్ష్మీనారాయణ, పాటాదారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-11T06:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising