ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకట్టుకున్న అశ్వాల పారువేట

ABN, First Publish Date - 2022-10-07T05:14:15+05:30

మద్దికెర గ్రామంలో పెద్దనగిరి, చిన్ననగిరి, యమన్ననగిరికి చెందిన యాదవరాజులు విజయదశమి రోజున అశ్వాలపారువేట నిర్వహించడం ఆనవాయితీ. బుధవారం జరిగిన ఈ వేడుక అందరినీ అలరించింది.

విజయం సాధించిన యమన్ననగిరి అశ్వాన్ని ఊరేగిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దసరా వేడుకల్లో పదేళ్ల బాలుడి విజయం


మద్దికెర, అక్టోబరు 6: మద్దికెర గ్రామంలో పెద్దనగిరి, చిన్ననగిరి, యమన్ననగిరికి చెందిన యాదవరాజులు విజయదశమి రోజున అశ్వాలపారువేట నిర్వహించడం ఆనవాయితీ. బుధవారం జరిగిన ఈ వేడుక అందరినీ అలరించింది. ఆరుబయటకు వెళ్లే అశ్వాలను ఉదయం గ్రామ శివారులోని భోజప్ప బావికి తీసుకెళ్లి శుభ్రం చేసి తీసుకుని వచ్చారు. సాయంత్రం పెద్దనగిరి, చిన్ననగిరి, యమన్ననగిరికి చెందిన యాదవరాజులు నెత్తికి తలపాగా, ఖడ్గం ధరించి రాజుల దుస్తుల్లో సైన్యం తో బయలుదేరారు. మద్దికెర గ్రామానికి మజరా గ్రామమైన బొజ్జనాయనపేటలో యాదవరాజులు నిర్మించుకున్న భోగేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి మూడు కుటుంబాల వారు ఆలయంలో పూజలు చేసి అనంతరం అశ్వాల పోటీలను నిర్వహిం చారు. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర జరిగిన ఈ అశ్వాల పారువేటలో మొదటి స్థానం యమన్ననగిరికి చెందికి జశ్వంత్‌రాయుడు, ద్వితీయ స్థానంలో చిన్ననగిరి, తృతీయ స్థానం పెద్దనగిరి అశ్వాలు నిలిచాయి. ఈ పారువేటను తిలకించడాని కి గ్రామస్థులు పెద్దఎత్తున తరలి వచ్చారు. విజయం సాధించిన అశ్వంతో రాజులు మెయిన్‌ బజారులో ఊరేగింపుగా వచ్చారు.

 శభాష్‌ జశ్వంత్‌రాయుడు: యాదవ కుటుంబానికి చెందిన పదేళ్ల బాలుడు జశ్వంత్‌రాయుడు అశ్వాల పారువేటలో పాల్గొన్నాడు. 11 మందిలో గుర్రాల పోటీలో పాల్గొనగా యశ్వంత్‌ విజయం సాధించడంతో పలువురు అభినందించారు.

Updated Date - 2022-10-07T05:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising