ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను బతికే ఉన్నా సార్‌!

ABN, First Publish Date - 2022-01-24T04:40:53+05:30

సచివాలయ ఉద్యోగుల తీరే వేరు. రేషన్‌కార్డులలో పేర్లు మార్పులు, చేర్పులు చేసేటప్పుడు విచిత్రమైన పనులు చేస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. రేషన కార్డులో సచివాలయ ఉద్యోగులు చంపేశారు 
  2. కార్యాలయం చుట్టూ  తిరుగుతున్న లబ్ధిదారుడు 


మద్దికెర, జనవరి 23: సచివాలయ ఉద్యోగుల తీరే వేరు. రేషన్‌కార్డులలో పేర్లు మార్పులు, చేర్పులు చేసేటప్పుడు విచిత్రమైన పనులు చేస్తుంటారు. వీటి వల్ల లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు. ఓ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినట్లు సిబ్బంది ధృవీకరించారు. దీంతో అతను బతికే ఉన్నానని ప్రకటించుకోవాల్సి వచ్చింది. హంప గ్రామంలోని మస్తాన్‌వలి, కుళ్లాయమ్మ కుమారుడు కుళ్లాయప్ప అనంతపురంలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు  కూడా మూడేళ్ల క్రితం అనంతపురానికి వెళ్లారు. రేషన్‌కార్డు అనంతపురంలోనే తీసుకుందామని అక్కడి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. భార్యాభర్తలకు మాత్రమే రేషన్‌కార్డు వచ్చింది. కుమా రుడు కుళ్లాయప్ప పేరు కార్డులో ఎక్కించాలని వారు కోరారు. సిబ్బంది.. సొంత గ్రామానికి వెళ్లి పరిశీలించుకోవాలన్నారు. మస్తానవలి హంప సచివాల యానికి ఈ నెల 20న వచ్చారు. అక్కడి రేషన్‌కార్డులో కుళ్లాయప్ప మరణించినట్లుగా ఆన్‌లైన్‌లో చూపించింది. దీంతో ఆయన ఖంగుతిన్నారు. తన కుమారుడు బతికున్నట్లు మీ సేవా ద్వారా ధృవీకరణ పత్రాన్ని తీసుకుని వచ్చారు అయినా అధికారులు పట్టించుకో లేదు. ఈ విషయంపై తహసీల్దార్‌ నాగభూషణం ను వివరణ కోరగా సమగ్ర విచారణ చేపట్టి ఆ బాధితుడికి న్యాయం చేస్తామని అన్నారు. 

చనిపోయినట్లు చూపించారు: కుళ్లాయప్ప

మా తల్లిదండ్రుల రేషన్‌కార్డులో నా పేరు ఎక్కించుకుందామని గ్రామ సచివాలయానికి వెళితే నేను చనిపోయినట్లు అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఆ తర్వాత నేను బతికే ఉన్నట్లు పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఏం చేయాలి? 


Updated Date - 2022-01-24T04:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising