ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా..?

ABN, First Publish Date - 2022-12-07T23:18:08+05:30

రాయలసీమ ప్రాంతవాసుల హక్కుల కోసం ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా అని మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ బీజేపీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ బెదిరింపులకు భయపడం

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి

హౌస్‌ అరెస్టు చేయడంతో ఇంటి వద్దే నిరసన

కర్నూలు (ఎడ్యుకేషన్‌), డిసెంబరు 7: రాయలసీమ ప్రాంతవాసుల హక్కుల కోసం ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా అని మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ బీజేపీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. కర్నూలు ఎస్టీబీసీ కాలేజీలో సీమ గర్జన సభ స్థలాన్ని పాలతో శుద్ధి చేస్తున్నట్లు ప్రకటించడంతో బుధవారం ఆటో నగర్‌లోని ఆయన స్వగృహంలో పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. దీంతో బైరెడ్డి రాయలసీమ వాసులతో కలిసి ఇంటి ఆవరణలోనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత వాసిగా ఇక్కడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా చెప్పుకునే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. రాయలసీమ వాసుల గొంతును ఎంత కాలం నొక్కుతారని, రాష్ట్ర ప్రభుత్వం తమ పద్ధతిని మార్చుకోకపోతే వైసీపీకి సమాధి కడతామని హెచ్చరించారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మూడున్నర సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి జగన్‌కు రాయలసీమ ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీమ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతానికి పచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు రాయలసీమకు సాగు, తాగు నీరందిస్తామని చెప్పారని, పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడైనా రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నిర్మించాల్సింది ఐకాన్‌ బ్రిడ్జి కాదని.. బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ కట్టాలని బైరెడ్డి డిమాండ్‌ చేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన సామెతలా మూడున్నర సంవత్సర కాలం పూర్తయిన తర్వాత రాయలసీమ సమస్యలు గుర్తుకు వచ్చాయా అని సీఎంను నిలదీశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక రాయలసీమ కావాలని తాను బస్సు యాత్ర చేస్తే తనకు ఒక్కరూ మద్దతు ఇవ్వలేదని అన్నారు. అసలు ఇక్కడి నాయకులు రాయలసీమ ప్రాంత వాసులో కాదో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలన్నారు. రాయలసీమలో పరిపాలన రాజధాని కావాలని అడిగితే న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పడం రోగం ఒకటైతే.. మందు మరొకటి ఇచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇంకా సీమ ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారని అన్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం తాను ప్రాణాలర్పించడానికైనా సిద్ధమేనని చెప్పారు. రాయలసీమ పేరును వాడుకుని వదిలేస్తున్నారని విమర్శించారు. సీమ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడుతోందని, ఇప్పటికైనా వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసి తాగు, సాగు నీరు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగరాజు, కొట్టె చెన్నయ్య, రవికుమార్‌, సీమ కృష్ణ, రాయలసీమ వాసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising