‘ఆస్పత్రి ఏడీ అవినీతిపై విచారణ జరిపించాలి’
ABN, First Publish Date - 2022-08-04T05:51:59+05:30
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న ఏడీ రమేష్‌కుమార్ అవినీతి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపిం చాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కే.శ్రీనివాసులు, కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు.
కర్నూలు(హస్పిటల్), ఆగస్టు
3: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న ఏడీ రమేష్‌కుమార్
అవినీతి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపిం చాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు
కే.శ్రీనివాసులు, కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు. బుధవారం
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పరిపాలన విభాగం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌ఓ, సీటీ, ఫార్మసిస్టు, స్టాఫ్‌నర్సు పోస్టుల
విషయంలో, అరోగ్యశ్రీ నిధుల పంపిణీ విషయంలో ఏడీ రమేష్‌కుమార్ చేతివాటం
ప్రదర్శించారని ఆరోపించారు. మెడికల్ ఏజెన్సీలకు కూడా తమకు అనుకూలంగా ఉన్న
వారికే కాంట్రాక్టులు అప్పజెప్పి వాటాలు పొందుతున్నారన్నారు. రూ.10 లక్షల
విలువైన మందులను మటు మాయం చేసి, వాటిని ఎలుకలు తిన్నాయని చెప్పడం
విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే కలెక్టర్ ఏడీని సస్పెండ్ చేయాలని డిమాండ్
చేశారు.
Updated Date - 2022-08-04T05:51:59+05:30 IST