ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యార్డులో తడుస్తున్న పంట ఉత్పత్తులు

ABN, First Publish Date - 2022-10-07T06:05:17+05:30

జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులు వానకు తడిసిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టించుకోని అధికారులు

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 6: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో  రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులు వానకు తడిసిపోతున్నాయి. దీంతో వ్యాపారులు నాణ్యత లేదని కొనడడం లేదని రైతులు ఆవేదన చెం దుతున్నారు. మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న గతంలో కర్నూలు యార్డులో పర్యటించి కవర్డ్‌ ప్లాట్‌ఫారం నిర్మాణానికి రూ.6 కోట్లను మం జూరు చేశారు. ఇటీవల ఈ నిర్మాణానికి కాంట్రాక్టరు అగ్రిమెంటు చేసుకు న్నట్లు అధికారులు తెలిపారు. అయితే నెలలు దాటిపోతున్నా కాంట్రాక్టరు పనులు మొదలు పెట్టలేదు. ప్రభుత్వం  సకాలంలో బిల్లులు మంజూరు చేయడం లేదని ఇటీవల చాలా మంది కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కర్నూలు మార్కెట్‌యార్డులో కూడా పను లను దక్కించుకున్న కాంట్రాక్టరు కూడా పనులు చేపట్టలేదని సమాచారం. ఇప్పటికైనా మార్కెట్‌ కమిటీ పాలకవర్గం అధికారులు వెంటనే మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌తో మాట్లాడి కవర్డ్‌ ప్లాట్‌ఫారం పనులు తొందరగా పూర్త య్యేటట్లు చూడాలని రైతులు కోరుతున్నారు. కాగా తొందరలోనే పనులు పూర్తి చేయిస్తామని, ఈ పనులకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డితో శంకుస్థాపన చేయిస్తామని మార్కెటింగ్‌ శాఖ డీఈఈ సుబ్బారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-10-07T06:05:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising