ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హామీలను నెరవేర్చాలి’

ABN, First Publish Date - 2022-08-12T05:57:34+05:30

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఐటీయూ కర్నూలు, నంద్యాల జిల్లాల కార్యదర్శులు నాగరాజు, గౌస్‌దేశాయి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, ఆంధ్రప్రదేశ్‌ వీఆర్‌ఏల సంఘం కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు అంజి, నాగేష్‌ డిమాండ్‌ చేశారు.

పాదయాత్ర చేస్తున్న వీఆర్‌ఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, ఆగస్టు 11:  ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు  పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఐటీయూ కర్నూలు, నంద్యాల జిల్లాల కార్యదర్శులు నాగరాజు, గౌస్‌దేశాయి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు  ఏసురత్నం, ఆంధ్రప్రదేశ్‌ వీఆర్‌ఏల సంఘం కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు అంజి, నాగేష్‌ డిమాండ్‌ చేశారు.  గురువారం తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గ్రామ రెవెన్యూ సేవకులు ఆత్మకూరు పట్టణంలోని మార్కెట్‌యార్డు నుంచి నల్లకాల్వ సమీపంలోని వైఎ్‌సఆర్‌ స్మృతివనం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం స్మృతివనంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ..  వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేయాలని, నామినిలను రెగ్యులర్‌ చేసి   టీఏ, డీఏ రూ.500కు పెంచాలని కోరారు. అలాగే సీనియారిటీ  వున్న వారిని స్వీపర్లుగా, వాచ్‌మెన్లుగా, వీఆర్‌వోలుగా నియమించాలని  హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రణధీర్‌, రామ్‌నాయక్‌, నరసింహనాయక్‌, స్వాములు, మల్లయ్య, సుబ్బయ్య, రమేష్‌, ప్రహ్లాద్‌, అభినాబేగం, మహేశ్వరి, రమాదేవి, ముర్తుజా తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-08-12T05:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising