ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హామీలు అమలు చేయాలి

ABN, First Publish Date - 2022-05-23T06:00:24+05:30

టూరిజం ఉద్యోగులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, టూరిజం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఉద్యోగుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర కార్యదర్శి వైఆర్‌కే రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వైఆర్‌కే రెడ్డి


కర్నూలు(న్యూసిటీ), మే 22: టూరిజం ఉద్యోగులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, టూరిజం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఉద్యోగుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర కార్యదర్శి వైఆర్‌కే రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం వెంకటరమణకాలనీ హరిత హోటల్‌లో డివిజన్‌ కార్యదర్శి వై.రాజశేఖర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టూరిజం సంస్థలో సుమారు 20 ఏళ్లుగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన చాలీచాలనీ జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. జగన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని హమీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సంస్థలో డిప్యుటేషన్‌ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పర్మినెంట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.రామక్రిష్ణ, కార్యదర్శి తురక శ్రీను వీరారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.సుభా్‌షచంద్రబోసు, డిప్యూటి మేనేజర్‌ మల్లికార్జున గౌడు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-23T06:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising