ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జీడీపీ ఆనకట్ట ఎత్తు పెంచితే భూములు ఇవ్వం’

ABN, First Publish Date - 2022-03-06T05:29:10+05:30

గాజులదిన్నె ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు పెంచితే భూములు ఇవ్వబోమని జీడీపీ ఎగువ ప్రాంత రైతులు శనివారం సర్వే అధికారులను అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోనెగండ్ల, మార్చి 5: గాజులదిన్నె ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు పెంచితే భూములు ఇవ్వబోమని జీడీపీ ఎగువ ప్రాంత రైతులు శనివారం సర్వే అధికారులను అడ్డుకున్నారు. దీంతో రైతులకు సర్వే జరిపే అధికారుల మధ్య సల్వ వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీడీపీ ఆనకట్టను ఒక మీటర్‌ పెంచి అందులో ఒక టీఎంసీ నీటిని అదనంగా నిలువ చేసేందుకుగాను రూ. 56 కోట్లు విడుదల చేసింది. గత 15 రోజుల క్రితం టెండర్‌ పనులు కూడా పూర్తయ్యాయి. శనివారం గోనెగండ్లలోని జీడీపీ ఎగువ భూముల్లో సర్వే పనులు ప్రారంభించారు. అయితే గోనెగండ్ల, ఎన్నెకండ్ల, ఐరన్‌బండ గ్రామాలకు చెందిన జీడీపీ ఎగువ ప్రాంత ఆయకట్టు రైతులు మాత్రం కట్ట పెంచితే తమ పంట పొలాలు నీట మునిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘం నాయకులు నజీర్‌సాహెబ్‌, శేషునాయుడు, రవికుమార్‌ నాయుడు, వెంకటేశ్వరరెడ్డి బజారి ప్రతాప్‌, గఫూర్‌ మాట్లాడుతూ 1970లో గాజులదిన్నె ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ గ్రామాలకు చెందిన మూడు వేల ఎకరాలు ఇచ్చామని, అందుకు నష్ట పరిహారం కింద ప్రభుత్వం రూ. 500 నుంచి రూ. 1000 వరకు ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు. అలాగే జీవో నెం 98 ప్రకారం నిర్వాసితులకు ప్రతి ఇంటిలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎకరం రూ. 4లక్షలు ఇస్తామని చెబుతోందని, అలాకాకుండా భూమికి బదులుగా మరో సాగు భూమిని ఇవ్వాలి లేదా మార్కెట్‌ ధర ప్రకారం ధర ఇవ్వాలిని డిమాండ్‌ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.

Updated Date - 2022-03-06T05:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising