ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగ నిర్ధారణ నేరం

ABN, First Publish Date - 2022-05-29T06:18:16+05:30

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని... అలా చేసే స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు, వెద్యులు చట్ట ప్రకారం శిక్షార్హులని కలెక్టర్‌ కోటేశ్వరరావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలా చేసే వారిపై చర్యలు
 కలెక్టర్‌ కోటేశ్వరరావు


కర్నూలు(కలెక్టరేట్‌), మే 28: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని... అలా చేసే స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు, వెద్యులు చట్ట ప్రకారం శిక్షార్హులని కలెక్టర్‌ కోటేశ్వరరావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో పీసీ అండ్‌ పీఎన్‌డీటీ చట్టం అమలుకు సంబంధించి డిస్ట్రిక్ట్‌ మల్టీ మెంబర్‌ అప్రాప్రియేట్‌ కమిటీ సమావేశంతో పాటు లింగ వివక్ష నిర్మూ లనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ స్కానింగ్‌ సెంటర్లకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని దుర్వినియోగం చేయ వద్దని సూచించారు. సమాజ హితానికి కృషి చేయాలని సూచించారు. వైద్యధికా రులు స్కానింగ్‌ సెంటర్లను తరచూ తనిఖీ చేయాలని ఆదేశించారు. లింగనిర్ధారణ పరీక్షలు జరగకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆడపిల్ల వద్దంటూ కుటుంబంలో ఎవరైనా వేధింపులకు గురి చేస్తే ఆధారాలతో పీసీ పీఎన్డీటీ కమిటీకి తెలియజేయవచ్చని చెప్పారు. ఏసీబీ కోర్టు జడ్జి బి.సునీత మాట్లాడుతూ స్కానింగ్‌ సెంటర్లు, వైద్యులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, చట్టప్రకారం వ్యవహరించాలని ఆదేశించారు. లింగ వివక్ష కారణంగా గర్భస్రావాలు జరగకూడదని సూచించారు. ఈసమావేశంలో ఏసీబీ కోర్టు జడ్జి, మహిళా కోర్టు ఇన్‌చార్జి మెజిస్ట్రేట్‌ బి.సునీత, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి బి.రామగిడ్డయ్య, దిశ పోలీసు స్టేషన్‌ సీఐ వెంకటరమణ, ఎస్‌.రామాంజినాయక్‌, బాల మద్దయ్య తదిరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-29T06:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising