కాల్వకు ఉత్సవమూర్తుల తిరుగు ప్రయాణం
ABN, First Publish Date - 2022-03-05T05:30:00+05:30
కాల్వబుగ్గ రామేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాల్వ గ్రామం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కాల్వబుగ్గకు తీసుకొచ్చారు.
ఓర్వకల్లు, మార్చి 5: కాల్వబుగ్గ రామేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాల్వ గ్రామం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కాల్వబుగ్గకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈనెల 5 వరకు ఉత్సవ మూర్తులకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు కాయ కర్పూరాలు సమర్పించి మొక్కు లు తీర్చుకున్నారు. శనివారం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ప్రతిష్ఠించి ఆలయ ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ, కల్లె నరసింహశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలతో, నందికోల సేవలు, భజంత్రీలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు కాల్వబుగ్గ దేవాలయం నుంచి కాల్వ గ్రామానికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గుర్రాల చెన్నారెడ్డి, భక్తులు చంద్రపెద్ద స్వామి, నాగతిరుపాలు, వెంగన్న, ఆకుల మహేష్, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST