ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యలోనే జారుకున్నారు..!

ABN, First Publish Date - 2022-06-26T05:20:29+05:30

ఆదోని నియోజ కవర్గ వైసీపీ ప్లీనరీలో ప్రజలు మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.

ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతుండగా ఖాళీ కుర్చీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ ప్లీనరీలో ఖాళీ కుర్చీల దర్శనం


ఆదోని(అగ్రికల్చర్‌), జూన్‌ 25: ఆదోని నియోజ కవర్గ వైసీపీ ప్లీనరీలో ప్రజలు మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఆదోనిలోని రెడ్డి భవనంలో శనివారం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్లీనరీ నిర్వహించారు. ప్లీనరీకి జనాలను భారీగా సమకూర్చుకున్నారు. అయితే నాయకుల మాటలు వినడానికి ఆసక్తి చూపని ప్రజలు మధ్యలోనే సమావేశం నుంచి జారుకున్నారు. ప్రజలను బయటికి వెళ్లకుండా అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు కుర్చోబెట్టుకు న్నారు. ముందుగా పరిశీలకుడు రుద్రగౌడ్‌, ఎంపీ సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 95 శాతం సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్మోహన్‌రెడ్డికి ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు పనులు జరగలేదని ఎవరూ నిరుత్సాహ పడవద్దని అన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతుండగా కార్యకర్తలు ఒక్కొక్కరు మధ్యలోనే జారుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. సమా వేశంలో వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ మధు సూధన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శాంతి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మహబూబ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ కామాక్షి తిమ్మప్ప, యువ నాయకులు జయమ నోజ్‌రెడ్డి, ఆయా కార్పొరేషన్‌ డైరెక్టర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T05:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising