ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైతులు నూతన పద్ధతులు పాటించాలి’

ABN, First Publish Date - 2022-01-29T04:51:25+05:30

ఫౌండేషన్‌ సీడ్‌ను రైతులే తయారు చేసుకోవచ్చని, అధిక దిగుబడుల కోసం రైతులు ఎప్పటికప్పుడు నూతన సస్యరక్షణ పద్ధతులు అనుసరించాలని ఏడీఏ విజయశేఖర్‌, ఏవో శ్రావణి రైతులకు సూచించారు.

పంటలను పరిశీలిస్తున్న ఏడీఏ విజయశేఖర్‌, ఏవో శ్రావణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందికొట్కూరు రూరల్‌, జనవరి 28: ఫౌండేషన్‌ సీడ్‌ను రైతులే తయారు చేసుకోవచ్చని, అధిక దిగుబడుల కోసం రైతులు ఎప్పటికప్పుడు నూతన సస్యరక్షణ పద్ధతులు అనుసరించాలని ఏడీఏ విజయశేఖర్‌, ఏవో శ్రావణి రైతులకు సూచించారు. శుక్రవారం నందికొట్కూరు మండలంలోని పది బొల్లవరంలో రైతుల శనగ, మినుము పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు జాతీయ ఆహార భద్రతా మిషన్‌(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) పథకం కింద శనగ విత్తనాలను ఉచితంగా అందజేశామని తెలిపారు. ఆ పంటలు ఇప్పుడు కోతకు వచ్చాయని అన్నారు. శనగ పంట ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని తెలియజేశారు. విత్తనాలు ఫౌండేషన్‌ సీడ్‌ కాబట్టి శుద్ధి చేసుకుని జాగ్రత్తలతో దాచి పెట్టుకుంటే వచ్చే ఖరీఫ్‌ కాలానికి ఈ విత్తనాన్ని ఫౌండేషన్‌ సీడ్‌గా వాడుకోవచ్చన్నారు. 

Updated Date - 2022-01-29T04:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising